హైదరాబాద్: 28°C
వార్తలు

'భూముల రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి'

MNCL: తాండూరు మండలంలోని ద్వారకాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించారు. భూ సమస్యల పరిష్కారంకు ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని తెలిపారు. గ్రామ నక్షాలు, రైతుల సంబంధిత భూముల నిర్ధారణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.