ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. బేద్రే పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన ఆయుధాల డంప్‌ను బలగాలు భగ్నం చేశాయి. తనిఖీల్లో భాగంగా ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ రైఫిల్స్, బీజీఎల్ లాంచర్లు, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
వార్తలు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల డంప్ భగ్నం


