PLD: పెదకూరపాడు-అంగన్వాడి 3వ సెంటర్లో పోషకాహార మహోత్సవాలు సీడీపీవో వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోషక విలువల గురించి, ప్లకార్డులు పట్టుకొని అవగాహన ర్యాలీ చేపట్టారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మన పెరట్లోనే ఏర్పాటు చేసుకొని పండించి వండుకొని తినాలని సీడీపీవో వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హిమాంబి అంగన్వాడీలు పాల్గొన్నారు.
వార్తలు
'పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తినాలి'


