ELR: మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ గడువును ఈనెల 23వ తేదీ రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వం పొడిగించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ ఏ. మస్తానయ్య తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ తమ స్టేషన్ పరిధిలోని 20 మద్యం దుకాణాలకు గాను, ఇప్పటికే 19 దుకాణాల రెన్యువల్ ప్రక్రియ పూర్తయిందని.. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 8.14 కోట్ల భారీ ఆదాయం సమకూరిందని ఆయన వెల్లడించారు.
వార్తలు
'ఈనెల 23 వరకు గడువు పొడిగింపు'


