హైదరాబాద్: 28°C
వార్తలు

జపాన్‌కు ధీటుగా హై-స్పీడ్ బుల్లెట్ రైలు

భారతీయ రైల్వే శాఖ విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, గంటకు 350 కి.మీ వేగంతో దూసుకెళ్లే స్వదేశీ 'B35' బుల్లెట్ రైళ్లను అభివృద్ధి చేయనుంది. రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్‌ను చేపడుతున్న భారత్, 2030 నాటికి ఈ స్వదేశీ బుల్లెట్ రైళ్లతో పాటు అవసరమైన మౌలిక వసతులను పూర్తిగా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.