హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంట్లో గ్యాస్ పైపు ఎప్పుడు మార్చాలి?

అత్యుత్తమ నాణ్యత కలిగిన LPG పైపుల జీవితకాలం గరిష్టంగా 5 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పైపును మార్చాలి. పైకి బాగానే కనిపిస్తున్నా.. నిరంతర వినియోగం వల్ల లోపలి భాగం బలహీనపడొచ్చు. పాతబడిన పైపుల నుంచి గ్యాస్ లీక్ అయితే ఇంట్లోని వారికే కాకుండా చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదం వాటిల్లుతుంది. అత్యధికంగా గ్యాస్ లీకేజీ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి.