హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరం గీతాలాపనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

వందేమాతరం గీతాలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 6 చరణాలను ఆలపించడాన్ని తప్పనిసరి చేయడంపై సంగీత విద్వాంసుడు కృష్ణ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై సీజేఐ ధర్మాసనం స్పందిస్తూ అన్ని చరణాలు పాడని వారిపై శిక్షాత్మక చర్యలు తీసుకోలేరని తెలిపింది. ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుల వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. కేంద్రం విధించే శిక్షాత్మక చర్యల అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది.