హైదరాబాద్: 28°C
వార్తలు

హరిత గ్రామపంచాయతీగా సారపాక

BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక గాంధీనగర్ సంత ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ పాల్గొని మొక్కలు నాటారు. సారపాకను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, ఈఓ రవికుమార్, ఐటీసీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.