హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎవరిని అరెస్ట్ చేసినా లిఖితపూర్వక కారణాలు చూపాలని ఆదేశించింది. కారణాలు చూపకుంటే పోలీసులపై శాఖాపరమైన విచారణ ఉంటుందని హెచ్చరించింది. 'ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టులకు కారణాలు చూపాలి. కారణాలు ఇవ్వకపోతే అరెస్ట్ చట్టవిరుద్ధం అవుతుంది. ఇలాంటి అరెస్టుపై పరిహారం పొందే హక్కు ఉంది. నిబంధనలు ఉల్లంఘించే పోలీసులపై చర్యలు తప్పవు' అని స్పష్టం చేసింది.