హైదరాబాద్: 28°C
వార్తలు

కావేరి జలాల వివాదంలో సుప్రీం కీలక తీర్పు

కావేరి జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కర్ణాటకకు 70 TMCలు అదనంగా కేటాయించాలన్న రిట్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రైవేట్ సొసైటీల పిటిషన్లు చెల్లవని స్పష్టం చేసింది. అంతరాష్ట్ర నీటి వివాదాల్లో థర్డ్-పార్టీలు లేదా సొసైటీలు జోక్యం చేసుకోలేవని తెలిపింది. సొసైటీల పిటిషన్లను విచారిస్తూ పోతే వివాదాలు ముగియని వ్యాఖ్యానించింది.