హైదరాబాద్: 28°C
వార్తలు

నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద ప్రవాహం

TG: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఎడవ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ఎగువ నుంచి వచ్చే వరద నీరు తగ్గడంతో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 4,142 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1800 క్యూసెక్కులు నమోదైంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 178.6782 టీఎంసీలు ఉంది.