బీహార్‌లోని జముయి లైంగిక వేధింపుల ఘటనపై మంత్రి శ్రవణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చిన్న సంఘటనలు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో నేరాలు పూర్తిగా అంతం కాలేదన్నారు. దీంతో మంత్రి తీరుపై పలువురు మండిపడుతున్నారు. కాగా, కోచింగ్ క్లాసుల నుంచి తిరిగి వస్తున్న టెన్త్ విద్యార్థులను ఓ మూక అడ్డుకుంది. బాలుడిపై దాడి చేసి, బాలికను లైంగికంగా వేధించారు.
వార్తలు
లైంగిక వేధింపులు.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


