హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధి: రేవంత్

TG: వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై CM రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులను పగడ్బందీగా చెయ్యాలన్నారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. వరంగల్, కరీంనగర్, ఖమ్మంను కలుపుతూ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం నాటికి రోడ్ కనెక్టివిటీ డెవలప్ కావాలని.. HYD తరహాలో వరంగల్‌ అభివృద్ధి జరగాలన్నారు.