హైదరాబాద్: 28°C
వార్తలు

9 మందిపై NIA ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్

AP: ఆన్‌లైన్ వేదికగా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న కేసులో NIA దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో 9 మంది నిందితులపై విజయవాడలోని NIA ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. VJA 2 టౌన్ పోలీసు స్టేషన్‌లో ఈ ఏడాది మార్చి 23న నమోదైన FIR ఆధారంగా NIA ఈ కేసును దర్యాప్తు చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులను, ఒక బాలుడిని అరెస్టు చేసినట్లు NIA తెలిపింది.