హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

KKD: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.