హైదరాబాద్: 28°C
వార్తలు

ఆవుల సంచారం.. ప్రజలకు ప్రాణ సంకటం

GNTR: తెనాలి బోసురోడ్డు చిట్టి ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఆవుల సంచారం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ప్రతిరోజూ రోడ్డుపై తిరుగుతున్న ఆవులు అకస్మాత్తుగా పాదచారులు, వాహనదారులపైకి దూసుకెళ్తుండటంతో ప్రమాద భయం నెలకొంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆవుల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.