PPM: 47 కిలోలగంజాయి అక్రమ రవాణా కేసులో నలుగురు నిందితులకు విజయనగరం ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. 2023లో సాలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తీర్పుపై జిల్లా ఎస్పీ ఎస్.వీ. మాధవ్‌రెడ్డి తెలిపారు.
వార్తలు
గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు


