హైదరాబాద్: 28°C
వార్తలు

టంగుటూరు బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు

ప్రకాశం: టంగుటూరు నుంచి ఒంగోలు, కందుకూరు వెళ్లే ప్రయాణికులు బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గాల్లో ఆర్డినరీ బస్సు సర్వీసులు తక్కువగా ఉండటంతో గంటల తరబడి బస్టాండ్‌లో వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.