హైదరాబాద్: 28°C
వార్తలు

సిమ్ దుర్వినియోగానికి రూ.50 లక్షల జరిమానా

తమ పేరు మీద జారీ అయిన సిమ్ కార్డులను ఇతరులకు వాడటానికి ఇవ్వవద్దని మొబైల్ వినియోగదారులను టెలికమ్యూనికేషన్ విభాగం హెచ్చరించింది. మోసపూరిత విధానాల్లో సిమ్ జారీ, IMEI నంబర్లను తారుమారు చేయడం వంటివి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే రూ.50 లక్షల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని పేర్కొంది.