హైదరాబాద్: 28°C
వార్తలు

దగ్గు మందు సీసాలపై హెచ్చరిక!

దగ్గు మందు సీసాలపై 'నాలుగేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరం' అనే హెచ్చరికలు ముద్రించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబరులో DGHS హెచ్చరికలు చేసినప్పటికీ చిన్నారులకు దగ్గు మందు వాడకం కొనసాగుతుండటంతో భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను పరిశీలన కోసం డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీకి సమర్పించారు.