హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

KNR: కరీంనగర్ కార్పొరేషన్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం పంపిణీ చేశారు.  7వ డివిజన్లో సదాశివపల్లి పరిధిలో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించారు. పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.