హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్జాతీయ క్రీడాకారిణికి ఆర్థిక సాయం

HNK: జిల్లాకు చెందిన దివ్యాంగురాలు కావేరి జ్యోతి శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీలకు ఎంపికయింది. ఆమె ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న మనోజ్, రాహుల్, కిరణ్ తదితరులు కలిసి రూ.45 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కావేరి జ్యోతి వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అందించిన సహకారం మరువలేనిదని, పోటీల్లో రాణించేందుకు కృషి చేస్తానన్నారు.