హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై అవగాహన

ASR: అరకులోయ (మం) యండపల్లివలస అంగన్‌వాడీ కేంద్రంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్‌ తల్లులకు మహిళల భద్రత, హక్కులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం తల్లులకు బట్టలు, చిన్నారులకు స్లేట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ కిల్లో అరుణ పాల్గొన్నారు.