హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం తాగి వాహనాలు నడపొద్దు: ACP

HNK: మద్యం తాగి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ ఏసీపీ టీ.సత్య నారాయణ సూచించారు. HNK పోలీస్ హెడ్ క్వాటర్స్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన సుమారు 150 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు, ప్రాణనష్టం, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. అలాగే, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.