హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరవు పరిస్థితులపై సర్వే చేయాలి: బీజేపీ

BPT: రేపల్లె ఆర్డీఓకు బీజేపీ నేతలు సోమవారం వినతిపత్రం అందించారు. 2026 ఖరీఫ్‌లో వర్షాభావంతో రైతులు నష్టపోయారని తెలిపారు. గ్రామాల్లో పంటలు ఎండిపోవడం, సాగునీరు, తాగునీటి కొరత సమస్యలను గుర్తించామన్నారు. కరువు మండలాలను వర్షపాతం ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రకటించాలని కోరారు. గ్రామాల వారీగా పంట నష్టం, సాగు విస్తీర్ణంపై సర్వే చేయాలన్నారు.