హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని బీజేపీకి విజ్ఞప్తి

WNP: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అడ్వకేట్ మున్నూరు రవీందర్‌కు బీజేపీ టికెట్ ఇవ్వాలని వనపర్తి జిల్లా బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆయనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావును కలిసి అభ్యర్థిత్వంపై వినతి చేసినట్లు తెలిపారు.