హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. భాద్రపద మాసం సందర్భంగా అర్చకులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, పూలతో అలంకరించారు. హారతి, మంత్ర పుష్పం అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.