హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ పాఠశాల వద్ద పారిశుధ్య సమస్య

VKB: జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్‌ మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల పరిసరాల్లో పారిశుధ్య సమస్య నెలకొంది. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో దుర్వాసన వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. మురుగునీరు పాఠశాలకు నీరందించే బోరుబావి సమీపంలోకి చేరుతున్నట్లు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.