హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెక్యూరిటీ గార్డులకు సామగ్రి ఏది...?

BDK: సింగరేణి మణుగూరు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల భద్రత, సంక్షేమంపై నిర్లక్ష్యం కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన సెక్యూరిటీ టెండర్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ, 190 మంది గార్డులకు టెండర్ నిబంధనల ప్రకారం అందించాల్సిన అవసరమైన సామగ్రి పూర్తిస్థాయిలో అందలేదని పలువురు గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.