సత్యసాయి: పెనుకొండ మండలం మావటూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ సోమవారం ఐడీ కార్డులు పంపిణీ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు ఐక్యతతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై అండగా నిలవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పార్టీ విజయానికి కృషి చేయాలి: ఉషశ్రీ చరణ్


