హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గురజాడ జయంతి వేడుకలు

AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం హెచ్ఎం షెమో మాట్లాడుతూ.. గురజాడ తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారని పేర్కొన్నారు. ఆయన రచించిన కన్యాశుల్కం తొలి ఆధునిక రచనల్లో ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు.