ఏలూరు వసంత మహల్ సెంటర్ వద్ద భవనం కూల్చివేత పనుల్లో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా భారీ యంత్రాలతో భవనాన్ని కూల్చివేస్తుండగా, శిథిలాలు పక్కనే ఉన్న భవనంపై పడ్డాయి. దీంతో స్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
ఆంధ్రప్రదేశ్
తృటిలో తప్పిన పెను ప్రమాదం


