హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చికిత్స పొందుతూ యువకుడు మృతి

CTR: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యశ్వంత్ రెడ్డి (18) మృతిచెందినట్లు రొంపిచర్ల పోలీసులు తెలిపారు. చల్లావారిపల్లెకు చెందిన యశ్వంత్ ఈ నెల 2న పీలేరు నుంచి రొంపిచర్లకు బైక్‌పై వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. తిరుపతిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. డిగ్రీ విద్యార్థి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.