కర్ణాటక మంత్రి శివలింగే గౌడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు సంబంధించిన పనులను సకాలంలో పూర్తి చేస్తే వారికి లంచం ఇవ్వడం ధర్మమే అని పేర్కొన్నారు. దీనిపై అక్కడి ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదన్నదే తన ఉద్దేశమని తెలిపారు.
వార్తలు
లంచం ఇవ్వడం ధర్మమే: మంత్రి


