హైదరాబాద్: 28°C
వార్తలు

వాతావరణ మార్పులపై పోరాటం చేయాలి: రాష్ట్రపతి

వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే పక్కా విధానాలు, కార్యాచరణ అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రభుత్వాలు, న్యాయనిపుణులు, ప్రభావిత వర్గాలు కలిసి పని చేయాలని సూచించారు. గ్రామీణులు, అడవుల్లో నివసించే తెగలు, సన్నకారు రైతులు, మహిళలు, ఇతర దుర్బల వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.