హైదరాబాద్: 28°C
వార్తలు

ఆకతాయిలకు సీఎం తీవ్ర హెచ్చరికలు

యూపీలోని ఆకతాయిలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వీధుల్లో నడిచే ఆడపిల్లలను వేధించే సాహసం ఎవరూ చేయబోరని, అలా చేయడానికి యత్నించే వ్యక్తి తన మరణ శాసనంపై తానే సంతకం చేసుకున్నట్లు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో అనుసరించిన కఠిన విధానం నేరస్థుల్లో భయాన్ని కలిగించిందని తెలిపారు.