హైదరాబాద్: 28°C
వార్తలు

నటుడు అజిత్‌ అభిమానుల కొత్త పార్టీ

తమిళనాడు నటుడు అజిత్ కుమార్ అభిమానులు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తమిళగ మక్కల్ కళగంను పార్టీ పేరుగా ప్రకటించారు. ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆబిత్, రాష్ట్ర కార్యదర్శిగా రామ్ కుమార్, కోశాధికారిగా మహమ్మద్ షా నియమితులయ్యారు. ఒకవేళ అజిత్ రాజకీయాల్లోకి వస్తే బాధ్యతలు స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఖాళీగా ఉంచినట్లు నేతలు తెలిపారు.