హైదరాబాద్: 28°C
వార్తలు

SIRతో 7.8 కోట్ల ఓట్లు గల్లంతు: కాంగ్రెస్

SIR ప్రక్రియ ముసుగులో దేశవ్యాప్తంగా భారీ కుట్రకు కేంద్రం తెరలేపిందని కాంగ్రెస్ ఆరోపించింది. కోట్ల మంది అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి అక్రమంగా తొలగిస్తుందని మండిపడింది. కేంద్రమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని తెలిపింది. SIR తొలి 2 దశల్లో ఏకంగా 7.8 కోట్ల మంది ఓటర్లను తొలగించినట్లు పేర్కొంది. మూడో దశలోనూ భారీ ఎత్తున ఓట్ల తొలగింపుకు సిద్ధమైందని మండిపడింది.