హైదరాబాద్: 28°C
వార్తలు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

కేరళంలోని వేర్వేరు జిల్లాల్లో జరిగిన ప్రకృతి విపత్తుల కారణంగా ఐదుగురు మృతి చెందారు. ఇడుక్కిలో షెడ్డుపై కొండచరియలు విరిగిపడి అన్నాచెల్లెలు మరణించారు. అలాగే మలప్పురం జిల్లాలో నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. కొట్టాయంలో మట్టిపెళ్లలు పడి చెన్నై మహిళ దుర్మరణం చెందింది.