హైదరాబాద్: 28°C
వార్తలు

అల్పపీడనం.. భారీ వర్ష సూచన

AP: తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని APSDMA తెలిపింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఎల్లుండికి తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు.. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ అల్లూరి, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.