హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కాకినాడలో జనసేన కీలక సమావేశం

AP: రేపు కాకినాడలో జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత పవన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో జనసేన MPలు, MLA, MLCలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో నియమించిన సమన్వయకర్తలు పాల్గొంటారు. స్థానిక ఎన్నికలకు నియోజకవర్గాలవారీగా చేపట్టాల్సిన సన్నద్ధత, కూటమి పక్షాల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు.