పంట రుణం కోసం రెవెన్యూ దస్త్రాలు కోరిన రైతును చేపలు, పులుసు, ఉల్లిపాయలు తెమ్మని అడిగిన VAOపై వేటు పడింది. కరూర్ జిల్లా దేవర్‌మలైకి చెందిన రైతు దేవరాజ్‌కు VAO కార్తీక్ ఫోన్ చేసి పాళైయం బస్టాండు వద్ద హోటల్ నుంచి 2 వేయించిన చేపలు, పులుసు తేవాలని చెప్పిన ఆడియో వైరల్ అయ్యింది. ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు ఘటన నిజమేనని తేల్చడంతో కార్తీక్‌ను సస్పెండ్ చేశారు.
వార్తలు
లంచంగా చేపల పులుసు అడిగిన VAO సస్పెన్షన్


