హైదరాబాద్: 28°C
వార్తలు

రిపోర్టింగ్‌కు ఇవాళ్టితో ముగియనున్న గడువు

TG: MBBS కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద రెండో విడతలో సీట్లు పొందిన అభ్యర్థుల రిపోర్టింగ్ గడువు నేటితో యుగియనుంది. శనివారంతోనే గడువు ముగియగా కాళోజీ వర్సిటీ ఇవాళ్టి సాయంత్రం 4 గంటల వరకు పెంచింది. దీంతోపాటు MBBS, BDS మొదటి విడత ప్రవేశాల్లో భాగంగా యాజమాన్య కోటా అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సిన గడువు కూడా.. ఈ సాయంత్రంతో ముగుస్తుందని వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.