హైదరాబాద్: 28°C
వార్తలు

రెన్యువల్‌కు నేటితో ముగియనున్న గడువు

AP: మద్యం షాపుల రెన్యువల్ గడువు నేటితో ముగియనుంది. మొత్తం 3,650 A4 షాపులకుగాను 2,931 షాపులు రెన్యువల్ చేసుకునేందుకు దుకాణదారులు ఆసక్తి చూపారు. ఇందులో 1,458 షాపుల నుంచి పూర్తి చెల్లింపులు జరగ్గా.. 655 షాపుల నుంచి పాక్షిక చెల్లింపులు జరిగాయి. ఇప్పటివరకు రెన్యువల్ ద్వారా రూ.754 కోట్ల ఆదాయం వచ్చింది. 1,076 షాపుల రెన్యువల్ ప్రక్రియ పూర్తికాగా, మరో 278 షాపుల DPEOలకు ఆమోదం లభించింది.