హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌కు స్టాండ్-అప్ కామెడీయే గతి: సీఎం

ఇండోర్‌లో జరిగిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమంలో ప్రధాని మోదీని అనుకరిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసిన మిమిక్రీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ స్టాండ్ అప్ కమెడియన్‌గా మారితే మంచి ఉపాధి లభిస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ఆయన ఓ నిరుద్యోగ పార్టీగా మార్చేశారని విమర్శించారు.