హైదరాబాద్: 28°C
వార్తలు

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫర్నీచర్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి మొత్తం షోరూమ్‌కు విస్తరించడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.