హైదరాబాద్: 28°C
వార్తలు

తృటిలో తప్పిన పెను ప్రమాదం

MLG: వెంకటాపురం మండల కేంద్రంలో ట్రాలీతో వేగంగా వచ్చిన ట్రాక్టర్ చికెన్ షాప్ ముందు పార్క్ చేసిన బైక్‌లను ఢీకొట్టింది. ఓ ద్విచక్ర వాహనం ట్రాక్టర్ టైర్ల కింద నలిగిపోయింది. మరో రెండు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఘటనతో షాప్ వద్ద ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. వాహనదారులు అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.