హైదరాబాద్: 28°C
వార్తలు

గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం

ముంబైలో బోరివలిలో జరుగుతున్న భారీ గర్బా కార్యక్రమంలో ముస్లింల ప్రవేశంపై వివాదం నెలకొంది. ఈసారి గర్బాలో ముస్లింలకు ప్రవేశం ఉండదని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఒకవేళ ముస్లీంలు ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలనుకుంటే తప్పనిసరిగా నుదిటిపై తిలకం ధరించి, దేవతలను పూజించాలని స్పష్టం చేశారు. గర్బా కార్యక్రమం లవ్ జిహాద్‌కు వేదిక కాకూడదని వ్యాఖ్యానించారు.