హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవదహనం

కర్ణాటక బెళగావిలో దారుణం చోటుచేసుకుంది. చావత్ వీధిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. తొలుత షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. కానీ ప్రమాదానికి ముందు ఓ వ్యక్తి బకెట్‌తో లోపలికి వెళ్లి తిరిగి ఒంటరిగా బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు అతని కోసం గాలిస్తున్నారు.