హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఏజీ నూరానీ స్మారక ఉపన్యాసంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన పాత వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. కమ్యూనిజం కంటే హిందూ మితవాద మతతత్వమే దేశానికి ముప్పు అని నెహ్రూ పేర్కొన్నారని వెల్లడించారు. ఇవి తన వ్యాఖ్యలు కాదని పూర్తిగా నెహ్రూ చేసిన వ్యాఖ్యలని ఉద్ఘాటించారు.